ఒకే చోట పని చేసే 11 మంది మహిళలు దాదాపుగా ఒకేసారి గర్భం ధరించారు. ఈ అరుదైన ఘటన అమెరికా మిస్సౌరీలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నెలల వ్యవధిలోనే వీరంతా తల్లులు కాబోతున్నారు. లిబర్టీ ఆస్పత్రిలో పనిచేసే ఈ 11 మందిలో 10 మంది నర్సులు, ఒక డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ప్రసూతి విభాగంలో పనిచేస్తోన్న వీరంతా నెలలు నిండుతున్నా విధులకు హాజరవుతున్నారు. వీరిలో ఒక నర్సు డెలివరీ డేట్ మే 27న ఉండగా, మిగతా వారంతా జూలై-నవంబర్ మధ్యలో తమ పిల్లలకు జన్మనివ్వనున్నారు.
మిగతా 10 మందిలో ఇద్దరి డెలివరీ డేట్ ఒకటే రోజు వచ్చింది. అయితే ఇలా ఒకే చోట ఇంత మంది గర్భం ధరించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ 11 మంది మహిళలు గర్భంతో దిగిన ఫొటోను ఆస్పత్రి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోతో సహా ఈ విషయం వైరల్‌గా మారింది. ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు 'మీ ఆస్పత్రి నీళ్లలో ఏం మహిమ ఉందో? అందరూ ఇలా ఒకేసారి గర్భం ధరించారు' అని చమత్కరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa