వరుసగా నాలుగో సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత రైతులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, రాయలచెరువు కట్టపై భారీ భహిరంగా సభ నిర్వహించారు. ఈ కార్యక్రంలో పర్యాటక శాఖామాత్యులు రోజా, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి, గూడూరు శాసనసభ్యులు వరప్రసాద రావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణ పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం లో మొదటగా పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, జౌళి శాఖ వారి ఆదర్వంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లోని ఉత్పతతులను, వ్యవసాయ పరికరాలను పరిశీలించారు.
తదుపరి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. సీఎం జగనన్నకి ఇష్టమైన పథకం రైతు భరోసా అని తన సుదీర్ఘ పాదయాత్రలో రైతుల కన్నీళ్లు చూసి వారికి ఏవిధంగా సహాయం చేయాలనీ తపించే వారని నాటి పాదయాత్రకి ప్రతిరూపమే నేటి రైతుకి పెట్టుబడి సాయం రైతు భరోసా కార్యక్రమమని చెప్పారు.