చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో నేడు గంగమ్మ జాతర పురస్కరించుకొని జలధి కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ జాతరలో భాగంగా జిలాని క్రాస్ వద్దకు గంగమ్మ ప్రతిమ చేరుకోగానే హెలికాప్టర్ నుండి గంగమ్మ తల్లిపై మూడు దఫాలుగా పూలవర్షం కురిపించారు, భక్తుల ఆనంద హేల మధ్యలో ఈ అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. చరిత్రలో ఇది వరకు ఈ ఘటన జరగలేదని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.