ఎన్టీఆర్ జిల్లా చందర్ల పాడు తహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలన చేశారు. చందర్లపాడు మండల పరిధిలోనే కొందరు రైతులు ఏసీబీ కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం వచ్చింది.
తాహాసిల్దార్ కారును సైతం సోదా చేసిన ఏసీబీ అధికారులు పలు సమస్యలపై కార్యాలయానికి వచ్చిన అర్జీ దారుల నుండి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన సమయంలో ఎవరైనా ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది కాకుండా అత్యధికంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అని పలువురు ద్వారా సమాచారం సేకరించారు ఇంకా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.