రాష్ట్రంలో జరిగే నేరాలన్నిట్లో వైకాపా వాళ్ళ పాత్ర ఉంటుంది. రేప్ లు, మర్డర్లు, గంజాయి, డ్రగ్స్, నాటుసారా, ఎర్ర చందనం స్మగ్లింగ్, కబ్జాలు, క్యాసినోలు, పేకాట శిబిరాలు.. ఒకటా రెండా? వీటికి తోడు కాంబాబు వల్ల తలదించుకునే స్థితి. మొఖం చూపించుకోడానికి 2013 గంజాయి కేసు బయటకి తోడారు అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రేపు జగన్ రెడ్డికి సభల్లో తను చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే పదేళ్ళ నాటి పాత కేసు పట్టుకొని వేలాడ్డం. టీడీపీ మీద బురద జల్లడానికి అవే చీప్ ట్రిక్స్. అవే చీప్ బుద్ధులు. చీప్ బతుకులు. ఆవిడ కుటుంబం ముందు నుండీ కాంగ్రెస్, తర్వాత వైకాపా.. 2019 తర్వాతే తెలుగుదేశంలో చేరారు అని గుర్తు చేసారు.