ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురిపై అత్యాచారం చేయించిన తల్లి.. చివరకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 16, 2022, 03:48 PM

ఓ మహిళ తన ప్రియుడి చేత తన సొంత కూతురిపై అత్యాచారం చేయించింది. ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


చెన్నైలో నివసించే ఓ మహిళ(38) కూలీగా పనిచేస్తుంది. ఆమెకు ఇంటర్ చదివే కూతురు ఉంది. ఆ మహిళకు ఓ 50 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో అతడు ఆ మహిళ కూతురిపై కన్నేశాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని ఆ మహిళకు చెప్పాడు. దీనికి ఆ తల్లి అంగీకరించింది. తన కుమార్తెపై అత్యాచారం చేసేందుకు తన ప్రియుడికి సహకరించింది. దీంతో పలుమార్లు అతడు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది.


బాధిత బాలికను గర్భంతో చూసిన ఇరుగుపొరుగువారు ఆమె తల్లిని ప్రశ్నించారు. తన కూతురికి పెళ్లి చేసినట్లు ఆమె వారికి చెప్పింది. ఆ బాలిక మే 1న ఇంట్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, తనకు పుట్టిన బిడ్డ అనారోగ్యం పాలవడంతో ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శిశువు​ తల్లి ఆధార్​ కార్డు చూసి ఆస్పత్రి సిబ్బంది షాక్​ అయ్యారు. తల్లి ఓ మైనర్​ అని తెలుసుకుని శిశుసంక్షేమ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి తల్లి, ఆమె ప్రియుడిని అరెస్ట్​ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com