ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవిని స్వీకరించాలని కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం కోరినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు.