ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ హెచ్చరించారు. రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని చెప్పారు. సురక్షిత భవనాల్లో తలదాచుకోవాలని సూచించారు. కడప జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం..
తిరుపతి: తిరుపతి అర్బన్, రేణిగుంట, నారాయణవనం, కేవీబీపురం, నాగులాపురం, పిచ్చాటూరు, పుత్తూరు.
చిత్తూరు: నగరి, నిండ్ర, విజయపురం
అన్నమయ్య: కురబలకోట, మదనపల్లె, బి.కొత్తకోట, గుర్రంకొండ, కలికిరి,వాయల్పాడు
కర్నూలు: చిప్పగిరి, మద్దికెర ఈస్ట్, ఆదోని, ఆస్పరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు మండలాలు