వయసు పెరుగుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు రావటం సహజమే. అయితే, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ సమస్య యువకుల్లోనూ బాగా కనిపిస్తుంది. బయటి ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, పోషకాలు లేని ఆహారాలను తినడం, లైఫ్ స్టైల్ లో ఛేంజెస్ వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ మోకాళ్ల నొప్పులున్న వారు కొన్ని రకాల ఆహార పదర్థాలను తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వాల్ నట్స్, చిన్నుల్లి, బాదాం, బొప్పాయి లను తరచూ తీసుకోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు క్రమంగా తగ్గుతాయి. ఇవి తినటంతో పాటు రోజూ వ్యాయామం కూడా తప్పనిసరి. అయితే, కష్టతరమైనవి కాకుండా తేలికైన వ్యాయామాలను చేస్తుండాలి. మోకాళ్ళ నొప్పికి వాడే నీ క్యాప్ ను రెండు మూడు రోజులకు మించి వాడకపోతేనే మంచిది.