కావలసిన పదార్థాలు: పుచ్చకాయ - 1, పంచదార - 2 కప్పులు, పాలు - 1కప్పు, సబ్జా - 2 స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ - కొద్దిగా.
తయారీవిధానం: ముందుగా పుచ్చకాయను సగానికి కోసి, ఆ సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా గింజలు లేకుండా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ కి ముందే 2 స్పూన్ల సబ్జాను నీటిలో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలను కాచి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను ఒక చిన్న గరిటె తో మెత్తగా చేసుకుంటే,కొన్ని ముక్కలు గుజ్జులాగా మారి షర్బత్ మరింత టేస్టీ గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల పంచదార, నానబెట్టిన సబ్జా, చల్లారబెట్టుకున్న పాలు వేసి బాగా కలపాలి. ఇందులో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బాదాం, జీడిపప్పు ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే, చాలా రుచికరంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఈ షర్బత్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే, ఈ షర్బత్ బాగా నచ్చుతుంది. టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన ఈ షర్బత్ ను వేసవిలో తప్పకుండ తాగండి.