వేసవిలో ఈ డ్రింక్ ను తీసుకోవటం వల్ల అధికంగా ఉండే ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా, శరీరంలో తగ్గిన ఎలెక్ట్రోలైట్స్ ను తిరిగి పెంపొందిస్తుంది. తద్వారా మన బాడీ శక్తిని పుంజుకుంటుంది. నీరసం తగ్గుతుంది.
కావలసిన పదార్థాలు: సబ్జా- 2స్పూన్లు, పటిక బెల్లం - 2 స్పూన్లు, బ్లాక్ సాల్ట్ - కొద్దిగా, నిమ్మకాయ - 2
తయారీవిధానం: ముందుగా సబ్జా ను ఒక గిన్నెలో తీసుకునినీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె ను తీసుకుని అందులో చల్లని నీటిని తీసుకోవాలి. లేదా ఐస్ క్యూబ్స్ అందుబాటులో ఉంటే, వాటిని కూడా వాడొచ్చు. ఇందులో, నానబెట్టిన సబ్జా, కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే, రాళ్ళ ఉప్పునైనా వాడొచ్చు. ఇప్పుడు పటికబెల్లాన్ని చితక్కొట్టి బాగా మెత్తగా చేసి ఆ నీటిలో వేసుకోవాలి. ఇలా చెయ్యటం వల్ల పటికబెల్లం త్వరగా కరిగిపోతుంది. ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. పంచదార, ఉప్పు, పులుపు సరిపోకపోతే, మీ రుచికి తగ్గట్టు మరలా కలుపుకోవచ్చు. అంతే, పుల్లపుల్లని లెమన్ సబ్జా రెడీ.