సింగనమల ఎస్సీ నియోజకవర్గ ఇన్చార్జిగా బండారు శ్రావణి కి తిరిగి బాధ్యతలు అప్పగిస్తున్నారు అని పార్టీ నేతలు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీ మేరకు ఆమె నేడు జిల్లాకు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఆమెకు సింగనమలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలుకుతూ పలుకుతున్నారు. గుత్తి సమీపంలోని బాటలో సుంకులమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న డంతో 150 వాహనాల్లో అక్కడికి వెళ్లి ఆమెకు ఘన స్వాగతం పలుకుతున్నట్లు పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
అక్కడినుంచి భారీ కాన్వాయ్ తో ఆమె అనంతపురానికి వస్తారని పేర్కొన్నారు. గడిచిన ఎన్నికల్లో సింగనమల నుంచి పోటీ చేసిన బండారు శ్రావణి వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓడిపోయారు. ఆమె పార్టీని సమన్వయం చేసుకొని ముందుకుపోవడంలో విఫలమయ్యారని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయారు. దీంతో సింగనమల పార్టీ నేతల వ్యవహార శైలి తలపోటుగా మారిపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో సమీక్ష నిర్వహించిన ప్రయోజనం లేకపోయింది. దీంతో అక్కడున్న పరిస్థితులపై జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పరిశీలకులు సమీక్షించి అధిష్టానానికి నివేదిక అందించారు.
ఈ మేరకు సింగనమల ఇంచార్జ్ పదవి నుంచి బండారు శ్రావణి తప్పించి, దిసభ్య కమిటీని నియమించారు. ఇందులో భాగంగా ఆలం నరస నాయుడు, ముంతిమడుగు కేశవ రెడ్డి ని రాష్ట్ర పార్టీ నియమించింది. ఇందులో బండారు శ్రావణి జెసి వర్గంగా గుర్తింపు పొందారు. మరో వర్గంతో విభేదాలు కొనసాగాయి. ఎట్టకేలకు టూ మెన్ కమిటీని పార్టీ నియమించింది. వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే సింగనమల ఎస్. సి నియోజకవర్గం కావడంతో కచ్చితంగా ఒక ఎస్సీ నేతను ఇన్చార్జిగా నియమించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ శ్రావణికి అవకాశం ఇచ్చారని ఆమె వర్గం పేర్కొంటోంది. సింగనమల నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత గొడవల నేపథ్యంలో కొంతకాలం ఈ సమస్యకు ఇప్పుడు స్టాప్ పెట్టాలని భావించారు. 20వ తేదీన చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తుండడంతో, ఆయన శ్రావణికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తారని సింగనమల నాయకులు పేర్కొన్నారు.
అయితే జిల్లా నాయకుల మద్దతు ఆమెకు ఏ మేరకు ఉందో 20వ తేదీ తేలిపోతుంది. ఇప్పటివరకు ఆమెకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం లేదని జిల్లా నాయకుడు ఒకరు పేర్కొన్నారు.