గడప గడప పేరుతో తిరుగుతున్న అధికార పార్టీ నాయకులను భయపడకుండా తమ తమ సమస్యల పై నిలదీయాలని పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి వ్హాడలవాడ అరవింద్ బాబు యావత్ ప్రజానీకానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుని కాలరాసే అర్హత ఎవరికీ లేదని, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు ఉండాలని , ఈ నేపథ్యంలో సమస్యల మీద నిలదీసే హక్కు ప్రజలకి ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలో స్థానిక 22 వార్డ్ పల్నాడు రోడ్ లోని పాత చెక్ పోస్ట్ ప్రాంతంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించి, ఈ ప్రజా చైతన్య యాత్రలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని,సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పోరాటానికి , ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వాల మెడలు వంచడానికైనా ముందడుగు వేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.