గంగాధర నెల్లూరు మండలం వేపంజేరి లో వెలసిన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామి వారి మూల విరాట్ కు వైభవంగా ఆలయ అర్చకులు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సుగంధ పరిమళ భరత పుష్పాలతో అలంకరించి నైవేద్యం సమర్పించి వేదమంత్రాలతో స్వామి వారినిమేల్కొలిపారు. అనంతరం దర్శన భాగ్యం కల్పించారు.