ల్ఐసీ ఐపీవో షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్(ఎన్ఎస్ఈ)లో ఎల్ఐసీ ట్రేడింగ్ జరిగింది.అయితే భారీ ఆశలు పెట్టుకున్న మదుపర్లకు నిరాశ తప్పలేదు. మదుపర్లు ఊహించిన దానికంటే తక్కువగా షేర్లు ట్రేడింగ్ కావటం వారిలో తీవ్ర నిరాశను కలిగించింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే 8.11శాతం నష్టంతో రూ. 872 వద్ద లిస్టయింది. ఈ లెక్కన కనీసం ఒకలాట్ అంటే 15షేర్లు కు రూ. 14,235 పెట్టుబడిగా పెట్టిన మదుపర్లకు రూ.1,155 లిస్టింగ్ లాస్ ఏర్పడింది. భారతీయ కాలమానం ప్రకారం.. ఉదయం 11.25 గంటలకు బీమా బెహెమోత్ షేర్లు పాలసీదారుల ధర ₹ 889 వద్ద చివరిగా ట్రేడింగ్ చేయబడ్డాయి, దాని లిస్టింగ్ ధర నుండి దాదాపు 2.5 శాతం లాభం మరియు ఇష్యూ ధర కంటే 6శాతం తక్కువ. ఉదయం ట్రేడింగ్‌లో షేర్ గరిష్టంగా ₹ 920కి పెరిగింది.