కాంగ్రెస్ నేత చిదంబరం ఇంట్లో సోదాలపై సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. పవర్ ప్రాజెక్టు వ్యవహారంలో సోదాలు చేశామని అధికారులు తెలిపారు. చిదంబరం ఇంటితో పాటు 10 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కర్ణాటక, ఒడిశా, పంజాబ్ లో సీబీఐ సోదాలు నిర్వహించింది. చిదంబరం, భాస్కర్ రామం, వికాస్ మకారియా ఇళ్లల్లో, తల్వండి సాబూ పవర్ లిమిటెడ్, బెల్ టూల్స్ కంపెనీల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రాజెక్ట్ వీసాల వ్యవహారంలో చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.