ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధులు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధుడు మంత్రి రోజాను ఓ వింత కోరిక కోరాడు. తనకు ఎవరూ తోడు లేరని, తనకు పెళ్లి చేయాలని మంత్రి రోజాను అడిగాడు. పెన్షన్ అయితే ఇప్పిస్తాం కానీ పెళ్లి చేయలేమంటూ మంత్రి నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.