ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లైన 6 నెలలకే భర్త ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 06:48 PM

తన భార్య సరిగా చీరకట్టుకోవడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ​లో చోటుచేసుకుంది. ముకుంద్​ నగర్ ​కు చెందిన సమాధాన్ సాబ్లె (24) అనే యువకుడు 6 నెలల క్రితం తన కన్నా ఆరేళ్లు ఎక్కువ వయసు ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నాడు. సోమవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మకుందువాడీ పోలీసులకు అతడి గదిలో సూసైడ్ నోట్ కనిపించింది. భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని, సరిగా నడవడం, మాట్లాడటం లేదని అతడు సూసైడ్ నోట్​ లో రాశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com