ఉదయగిరి మండలం ముసాయిపేటలో బంగారం, రాగి నిక్షేపాలు దండిగా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మ్యాపింగ్‌ను చేపట్టి ఐదు ప్రాంతాల్లో 46 నమూనాలను సేకరించింది. దాదాపు 2 వేల హెక్టార్లకు పైగా భూమిలో నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఇరవై నుంచి 110 మీటర్ల లోపు బంగారు నిక్షేపాలతో పాటు రాగి నిక్షేపాలను గుర్తించారు.