మంగళగిరి పట్టణం లో బుధవారం మధ్యాహ్నం నుండి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ శారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఛానెల్ వద్ద 33 హెచ్ ట్రాన్స్ఫార్మర్ లో సమస్య కారణంగా మరమ్మత్తులు జరిపిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో నేటి మధ్యాహ్నం నుండి కుళాయిల ద్వారా త్రాగునీటి సరఫరా నిలిచి పోతుందని అన్నారు. ప్రజలు గమనించి త్రాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. తిరిగి గురువారం మధ్యాహ్నం నుండి యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.