మధుమేహంతో బాధపడేవారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే... ఇందులోని కొన్ని ప్రత్యేక గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాకుండా కరివేపాకును నమలడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి సమస్యలను నివారించవచ్చు. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే రుమాటిక్ సమస్యలను దూరం చేస్తుంది.
కరివేపాకు చిన్నవయస్సులోనే జుట్టు రాలడం, పల్చబడడం, తెల్లబడడం వంటి వాటిని అరికట్టి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందువల్ల కరివేపాకును రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అలాగే కరివేపాకు రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. అదనంగా, ఇది అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకు కూడా మంచి సౌందర్య సాధనం. కరివేపాకులోని గుణాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ఏర్పడే ముడతలు, మచ్చలు మరియు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది మరియు వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.