గుంటూరు జిల్లా పెదనందిపాడులో పోలేరమ్మ తల్లి ఆలయంలో తిరునాళ్ల వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయానికి విద్యుత్తు లైట్లతో చూడముచ్చటగా అలంకరించారు. పోలేరమ్మ తల్లిని పూలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కోలాట ప్రదర్సనాలు, విద్యుత్తు ప్రభలు ప్రేక్షకులను అలరించాయి.