కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పదో తరగతి సిలబస్ లో ఉన్న భగత్ సింగ్ పాఠాన్ని తొలగించింది. ఆ పాఠం స్థానంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చిందని AIIDSO,AISEC సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. దీని పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కన్నడ ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఇది భగత్ సింగ్ ను అవమానించడమే అన్నారు. వివిధ పార్టీల నేతలు, విద్యావేత్తలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీని పై కన్నడ సర్కార్ వెనక్కి తగ్గుతుందా లేదా అనేది చూడాలి. స్వాతంత్య్ర ఉద్యమకారులను అవమానించి బీజేపీ దేశానికి ఏం సందేశమిస్తుందని సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.