నాటుసారా కలిగి ఉన్న కేసులు నిందితులైన నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన ఎర్ర బోలో ఆంజనేయులు, సభావత్ విజయ భాస్కర్ నాయక్, పల్లె బోయిన రాజశేఖర్ లకు కు రిమాండ్ విధిస్తూ స్థానిక రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె అంజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 16న నిందితులు చేజర్ల గ్రామం లో 30 లీటర్ల నాటుసారా కలిగి ఉండగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.