ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ ఐవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి వెంకటేశ్వరరావు సర్వీసును రీ ఇన్ స్టేట్ చేస్తున్నట్లు ఆ జీవో లో పేర్కోన్నారు. కాగా తనను సస్పెన్షన్ చేసినరోజు నుంచి సర్వీసులోకి తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరుతున్నారు. రెండేళ్ల కాలాన్ని కూడా సర్వీసు లోకితీసుకోవాలని కోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు జీఏడీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం సూచించింది.