పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గానికి సంభందించిన మానుకొండ జాహ్నవి అనే మహిళా ప్రస్తుతానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని గా ఉన్న సంగతి తెలిసిందే. ఈమె 2019 ఎన్నికల తర్వాత టీడీపీ లో చేరి క్రియాశీలకంగా పనిచేసింది. ఈ మధ్య కాలంలో ఈమె గంజా కేసులో అరెస్ట్ ిన సంగతి కూడా తెలిసిందే. కానీ ఈ కేసు 2013 లో ఫైల్ ఐనట్లు పోలీస్ శాఖ తెలిపారు. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న జాహ్నవి ఈ నేరం మోపిన సమయంలో వైసీపీ పార్టీలోనే ఉన్నట్లు టీడీపీ నాయకులు ఆధారాలను చూపించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... మానుకొండ జాహ్నవి 2013లో సైబరాబాద్ లో నమోదైన గంజాయి కేసులో తొమ్మిదేళ్ళ తర్వాత ఇప్పుడు అరెస్టు చేయబడ్డారు. అప్పట్లో ఆమె వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసారు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినప్పటికీ నిజానిజాలు తేలేవరకు తెలుగుదేశం ఆమెను సస్పెండ్ చేసింది. అదే టీడీపీలో ఉండే నిజాయితీ అని తెలియచేసారు.