- రోజుకు మూడు సార్లు నియమిత వేళల్లో భోజనం చేయాలి.
- తాజాగా వండిన, వేడిగా ఉన్న, తేమతో కూడిన సూప్ లు తాగాలి. చల్లగా, పొడిగా, పెళుసుగా ఉండే పదార్థాలు తినొద్దు. తీపి, ఉప్పుతో కూడిన పదార్థాలు తింటూ, కారంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి.
- కాఫీ, టీలు ఎక్కువగా తాగకూడదు. వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.
- ఎండలో తిరిగేవారు కచ్చితంగా నెత్తిపై స్కార్ఫ్ లేదా టోపీని వాడాలి. ఎండ నేరుగా తలపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉండవు.
- తల నొప్పి వచ్చిన వెంటనే టీ జోలికి వెళ్లడం తగ్గించాలి. వాటి స్థానంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి డ్రింక్స్ తీసుకోవాలి.
- అరటి పండు, పైనాపిల్, పుచ్చకాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి.