గుంటూరులోని నగరంపాలెం పరిధిలో ఐటిసి దగ్గరలో రహదారిపై రాజస్థాన్ గుజరాత్ కి సంబంధించిన యువతులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రహదారి పై వచ్చే వాహనాలను నిలిపి చేతిలో ఏదో ఒక పేపర్లు చూపించి డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు. వాహనదారులు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రత్తిపాడులో కూడా రెండు రోజుల క్రితం ఇలానే రహదారి పై వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.