పెదకాకాని బైపాస్ రోడ్డుపై వాహనదారులను ఆపి అక్రమంగా, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నా ఐదుగురు గుజరాతి యువతులను పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్పీ ఆరిఫ్ ఆఫీజ్ ఆదేశాల మేరకు హుటాహుటిన కాకాని సీఐ, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏ కారణం చేత డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు వారిని ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో యువతులను స్టేషన్ తరలించారు. యువతుల బారినపడ్డ వాహనచోదకులు వేగంగా స్పందించిన పెదకాకాని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.