ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెఫ్టి‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా

national |  Suryaa Desk  | Published : Wed, May 18, 2022, 11:40 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య సాగుతున్న పోరుకు తెరపడినట్లయింది. లెఫ్టి‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ రాజీనామా చేశారు. ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపించారు. అయితే ఆయన వ్యక్తిగత కారణంతోనే పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. 2016 డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు స్వీకరించిన బైజల్ ఐదు సంవత్సరాల 4 నెలలకు పైగా సుదీర్ఘ పదవీకాలం కొనసాగారు.


అయితే అనిల్ బైజల్‌కు... సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌తో ఘర్షణాత్మక వాతావరణం ఉండేది. బైజల్ 1969 బ్యాచ్ AGMUT క్యాడర్, చాలా ప్రాంతాల్లో ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) మాజీ వైస్ చైర్మన్‌గా కూడా ఢిల్లీలో పనిచేశారు. అటల్ బీహారీ వాజ్‌పేయి పాలనలో బైజల్ హోం కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఎన్నో పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు.


తన 37 ఏళ్ల కెరీర్‌లో బైజల్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా, ప్రసార భారతి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా, గోవా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా, నేపాల్‌లో భారతదేశ సహాయ కార్యక్రమానికి కౌన్సెలర్‌గా కూడా పనిచేశారు. బైజల్ అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com