ప్రస్తుత ఆధునిక కాలంలో ఏ వ్యాపారానికి అయినా, చివరకు చందాల వాసులకు సైతం అందాల్ని పెట్టుబడిగా పెడుతున్నారు. ఇలాంటి ఉదంతమే గుంటూరు జిల్లాలో కనిపిస్తోంది. గుంటూరులో రోడ్లపై కొందరు అమ్మాయిలు జీన్స్, టీ షర్టులో రోడ్డుపై ప్రత్యక్షమవుతున్నారు. అటు వైపుగా వస్తున్న వాహనాలు బలవంతంగా ఆపి చందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ బలవంతపు వసూళ్లపై కొందరు వాహనదారులకు చిర్రెత్తుకొచ్చింది. వాహనాలను ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. రోడ్లపైన బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 19 మంది గుజరాత్ అమ్మాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతంలోని గ్రామాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. తమ గ్రామం వరదల్లో కొట్టుకుపోయిందని సాయం చేయాలని కోరతారని.. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోతే.. యువకుల్ని బెదిరించి బైక్ తాళం లాక్కున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డబ్బులు ఇచ్చే వరకు ఇలాగే బెదిరించేవారంటున్నారు. వీరరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా గుంటూరు బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు.
ఈ అమ్మాయిలు కూడా రోడ్లపై యువతులు గుంపులుగా తిరుగుతున్నారు.. కొంతకాలంగా వాహనదారుల్ని ఈ గ్యాంగు ఇబ్బందిపెడుతూ.. డబ్బులు కూడా వసూలు చేస్తోంది. వీరు స్థానికంగా ఓ చోట మకాం వేసి ఇలా రోడ్లపై తిరుగుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ గుజరాత్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలో ఉపాధి లేదని.. అందుకే ఇలా వచ్చామని యువతులు అంటున్నారట. వీరిని తిరిగి అహ్మదాబాద్‌కు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.