ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మే 22న పంజాబ్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందే హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కు దూరం కానున్నాడు. కేన్ భార్య సారా రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో అతడు బయోబబుల్ ను వదిలి న్యూజిలాండ్ కు వెళ్లాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ యాజమాన్యం అధికారికంగా ట్విటర్ లో ప్రకటించింది. హైదరాబాద్ తన ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి ప్లే ఆఫ్స్ కి చేరేందుకు అవకాశాలను పెంచుకోవాలని చూస్తోంది. అయితే జట్టును నడిపించే కేన్ విలియమ్సన్ దూరమైన క్రమంలో హైదరాబాద్ ఎలా ఆడుతుందో చూడాలి. కేన్ లేకపోవడంతో హైదరాబాద్ టీంకి భువనేశ్వర్ లేదా పూరన్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.