ఏపీలో ఈ నెల 26 నుంచి వరుసగా 4 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు నిర్ణయించారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఈనెల 29 వరకు 17 మంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రలో తొలి సభతో మంత్రుల బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
శ్రీకాకుళంలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించి యాత్రను ముగించాలని మంత్రులు సీఎం జగన్ వద్దకు ప్రతిపాదన తెచ్చారు. ఇందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ బస్సు యాత్రలలో వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం.