జగన్ ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన కార్యక్రమం గడప గడపకి మన ప్రభుత్వం . ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం వారి కుటుంబానికి చేసిన సాయాన్ని గురించి వివరించాలనేది సీఎం జగన్ ఆదేశం . ఈ క్రమంలోనే ప్రజలు నుండి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఈ కార్యక్రమం సక్సెస్ కాలేదనే చెప్పాలి. చాల చోట్ల ప్రజలు తిరుగుబాటు చెయ్యడం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీ సత్య సాయి జిల్లా గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నల్లచెరువు మండలం పి కొత్తపల్లికి వెళ్లిన కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సమస్యలపై మహేశ్వర్రెడ్డి అనే యువకుడు నిలదీశాడు. సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే నీళ్లు నములుతుంటే, వైసీపీ నేత ఆ యువకుడిని చెంపదెబ్బ కొట్టి అక్కడ్నించి ఎమ్మెల్యేతోపాటు జారుకున్నారు.