కృష్ణా జిల్లా: జక్కంపూడి కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్) వద్ద స్థానికులు తో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బైఠాయించారు. కాలనీలో డాక్టర్లు లేక మందులు లేక వేల మంది ప్రజలు అల్లాడుతున్నారని నెలల తరబడి డాక్టర్ అందుబాటులో ఉండటం లేదని ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు. అసాంఘిక కార్యక్రమాలకు నెలవైన గంజాయి బ్యాచ్ ని అరికట్టేందుకు పోలీసులు రావాలంటూ నినాదాలు చేశారు.
జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం. కాలనీ ఆస్పత్రి వద్ద స్థానిక ప్రజలతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు నిరసనకు దిగడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.