ఫ్రిజ్ లో నుండి వస్తున్న వాసనతో ఇబ్బంది పడుతున్నారా?. ఈ సింపుల్ చిట్కాతో ఆ దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. ఎండబెట్టిన నారింజ లేదా బత్తాయి, కమలా, నిమ్మ పండ్ల తొక్కల పొడిని చెంచా తీసుకుని దీనికి కాస్త ఉప్పుని చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి ఫ్రిజ్ లోపల ఓ మూల ఉంచాలి. ఇలా చేస్తే ఆహారపదార్థాల వాసనలని పీల్చుకుంటుంది. అలాగే చెత్తబుట్ట అడుగున నాలుగైదు ఎండిన నిమ్మ/నారింజ తొక్కలను వేస్తే దుర్వాసన రాకుండా చెక్ పెడతాయి. నిమ్మ/ నారింజ తొక్కలను నీళ్లలో వేసి మరిగించి ఆ పై దానికి చెంచా లవంగం పొడి కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేస్తే దోమలు, ఈగలు రాకుండా అడ్డుకోవచ్చు.