రాష్ట్రంలో గంజా విచ్చల విడిగా దొరుకుతుంది అంటే నమ్మక తప్పదు. దేశం లోని అన్ని రాష్ట్రాలకి ఆంధ్ర ప్రదేశ్ నుండే గంజా సరఫరా అవుతుంది అంటే,ఆలోచించండి ఇది ఎంత పెద్ద స్కాం...? అలానే ఇంతలా జరుగుతన్న ప్రభుత్వాలు, పోలీస్ వారు కట్టడి చేయలేకపోతున్నారు అంటే దీని వెనక పెద్ద పెద్ద హస్తాలు ఉంది ఉండొచ్చు. తాజాగా ఇంకొక కోణంలో ఒక గంజా కేసు బయటపడింది. అల్లూరి మన్యంలో 300 కేజీల గంజాయితో, అడ్డంగా దొరికిన వైసీపీకి చెందిన రంపచోడవరం వార్డు సభ్యుడు కృష్ణారెడ్డి పోలీసులను తప్పించబోయి, భూపతిపాలెం రిజర్వాయర్ జలాశయంలోకి స్కార్పియో వాహనం బోల్తా..ఆగని వైసీపీ నేతల గంజాయి వ్యాపారం.. అని ప్రతిపక్షాలు గొల్లు మంటున్నాయి. ఐనప్పటికీ నిజానిజాలు తేల్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే అదునుగా చేసుకొని ప్రతిపక్షాలు , ప్రభుత్వం పై మాటలు దువ్వుతుంటారు.