అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామంలో గురువారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మహిళలను ఆయన కోరారు. అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ జడ్పిటిసి సత్యవేణి మండల పార్టీ అధ్యక్షుడు వాసు ఎంపీడీవో అరుణశ్రీ తాసిల్దార్ రాణి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు