ఉయ్యాలవాడ మండల పరిధిలోని మాయలూరు గ్రామ సమీపంలో ఉన్న కుందు నదిలో యువకుడు గల్లంతయ్యాడు. నంద్యాల పట్టణానికి చెందిన షేక్ ఖాసిం వలి ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం మయూరి గ్రామానికి వచ్చాడు. పనులు ముగిసిన అనంతరం బట్టలు శుభ్రం చేసుకోవడానికి స్థానిక కుందు నది వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడని తోటి స్నేహితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహం కోసం గాలిస్తున్నారు.