ఆదోని రెవెన్యూ డివిజన్‌లో శుక్రవారం తెల్లవారుజామున 134. 2 మిమీ వర్షపాతం నమోదయింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయం 10. 6, కోసిగి 28. 2, కౌతాళం 6. 4, పెద్దకడుబూరు 13. 4, ఎమ్మిగనూరు 22. 4, నందవరం 14. 2, గోనెగండ్ల 38. 0, ఆదోని 1. 0 మిమీ వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డివిజన్ మొత్తంగా 134. 2 మిమీ వర్షం కురిసి సగటున 14. 9 మిమీ వర్షపాతం నమోదైంది. అధిక వర్షం కురిసిన ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది. శివారు ప్రాంతాల్లోని ప్రజల జనజీవనానికి ఇబ్బంది పడ్డారు.