లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 26వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
లోక్ అదాలత్ లో పరిష్కరించే కేసులకు అప్పీల్ ఉండదని, శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. పోలీసులు కక్షిదారు లతో సమావేశాలు నిర్వహించి లోక్అదాలత్ ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ఇరు వర్గాలతో చర్చించి రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకునే లా పోలీసులు కృషి చేయాలన్నారు.