ఈ రోజుల్లో చాలా మందిని గ్రాస్ ప్రాబ్లం వేధిస్తోంది. మరి అటువంటి వారు ఇలా చేస్తే ఆ సమస్య త్వరగా నయం అవుతుంది. సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల అజీర్తి దూరం అవుతుంది. దీనివల్ల కడుపు ఖాళీగా ఉండదు. అంతేకాదు కొవ్వు కూడా చేరదు. ఈ కారణంగా తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అరుగుదల కూడా బాగుంటుంది.
భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. దాదాపు 30 నిమిషాల తర్వాతే నీరు తాగితే త్వరగా ఆహారం అరుగుతుంది. అదేవిధంగా, రోజుకి ఎంతవీలైతే అంతగా ఎక్కువగా నీరు తీసుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి రోజుకి కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి. కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. జీర్ణం కూడా త్వరగా అవుతుంది. రోజుకి కంటినిండా నిద్రపోవాలి. సరైన నిద్ర ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.