ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విడవకుండా జడివాన కురుస్తోంది. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 52 మండలాల్లో తేలిక పాటి నుంచి బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా గుర్రంకొండలో 38. 8, అత్యల్పంగా పుత్తూరులో 0. 4మి. మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా. వాయల్పాడులో 37. 2, పీలేరులో 34. 2, గుడిపాలలో 33. 2, బి. కొత్తకోటలో 30. 2, నిమ్మనపల్లెలో 30. 2, పెద్దమండ్యంలో 28. 6, యాదమరిలో 28. 2, పెనుమూరులో 27, చౌడేపల్లెలో 26. 2, ఐరాలలో 25. 6, చిత్తూరులో 24, పీటీఎంలో 21. 2, కురబలకోటలో 20. 6, సోమలలో 20. 6, బంగారుపాళ్యంలో 20. 6, పులిచెర్లలో 20. 4, పలమనేరులో 20. 2, కలికిరిలో 19, పాకాలలో 16. 2, తంబళ్లపల్లెలో 15. 4, తిరుపతి అర్చన్‌లో 15. 2, పూతలపట్టులో 15, పెద్దపంజాణిలో 14. 6, గంగవరంలో 14. 2, చంద్రగిరిలో 13. 6, సదుంలో 13. 2, తిరుపతి రూరల్‌లో 12. 4, ఎర్రావారిపాళెంలో 12. 2, చిన్నగొట్టిగల్లులో 12. 2, రామచంద్రాపురంలో 10. 8, రామకుప్పం 10. 2, మిమీ చొప్పున. మిగిలిన 18 మండలాల్లో అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైంది.