సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది బాలికలను కొందరు ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుంటున్నారు. ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని చెబుతూ లోబర్చుకుంటున్నారు. ఇదే కోవలో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన బాలికను లాడ్జికి రప్పించి మద్యం తాగించాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏపీలోని గుంటూరు నగరానికి చెందిన బాలికకు తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబు అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్నాళ్ల క్రితం పరిచయం అయ్యాడు. ఆ తరువాత వారి పరిచయం ఫోన్ కాల్స్‌కు చేరింది. క్రమంగా ఒకరికొకరు బాగా పరిచయం అయ్యారు. ఈ క్రమంలో బుధవారం గ్రేస్ బాబు గుంటూరు శివారులోని ఓ హోటల్ గది తీసుకున్నాడు. తన స్నేహితులు రిక్కీ, మణికంఠలతో కలిసి బాగా మద్యం తాగాడు. తన స్నేహితులను ఆ బాలిక వద్దకు పంపించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేకపోవడంతో గ్రేస్ బాబు అన్నం తినడం లేదని, నువ్వొస్తేనే తింటానని అంటున్నాడని చెప్పారు.
ఆ తర్వాత మాటలతో మభ్యపెట్టి ఆ బాలికను బైక్‌పై ఎక్కించుకుని, హోటల్‌కు తీసుకెళ్లారు. గదికి వెళ్లిన తర్వాత బలవంతంగా మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లిన తర్వాత ఆమెపై గ్రేస్ బాబు స్నేహితులు రిక్కీ, మణికంఠ అత్యాచారం చేశారు. బాలిక స్పృహ కోల్పోవడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. బాలిక తల్లిదండ్రులు విషయం తెలుసుకుని, వెంటనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారణ జరిపి గురువారం సాయంత్రం నిందితులపై కేసు పెట్టారు. ప్రియుడు గ్రేస్ బాబు అత్యాచారం చేయలేదని పోలీసులు చెబుతున్నారు.