--- గోధుమపిండితో తయారుచేసే చపాతీలను చాలా మంది రాత్రి పూట భోజనానికి బదులుగా తింటుంటారు. నిజానికి చపాతీలను మధ్యాహ్న వేళల్లోనే ఆరగించాలి.
--- చాలా మందికి ఉదయాన్నే అరటి పండ్లను తినే అలవాటుంటుంది. అది మంచిదే. అరటిపళ్ళను రాత్రివేళల్లో అస్సలు తీసుకోకూడదు.
--- శరీరానికి పోషకాలను అందించే పాలను చాలా మంది ఉదయాన్నే తాగుతుంటారు. కానీ, పాలను రాత్రిపూట నిద్రపోయే ముందు తాగాలి.
--- ఆపిల్ పండ్లను కేవలం ఉదయం వేళల్లోనే తినాలి. రాత్రి సమయంలో తినకూడదు.
--- చాలా మంది మధ్యాహ్న భోజనంలో, కాకుండా రాత్రిపూట భోజనంలో పెరుగును తీసుకుంటారు. కానీ, పెరుగును ఎల్లప్పుడూ మధ్యాహ్న భోజనంలోనే తినాలి.