వేసవిలో దొరికే అద్భుతమైన పండ్లలో కర్బూజా ఒకటి. పుచ్చకాయ లాగానే ఇది కూడా శరీర వేడిని తగ్గించటంలో బాగా సహాయం చేస్తుంది. కర్బూజను ముక్కలుగా కోసి తినటం కన్నా జ్యూస్ గా తాగితే చాలా టేస్టీ గా ఉంటుంది. కర్బూజ జ్యూస్ ను తయారు చెయ్యటం చాలా ఈజీ. అదెలాగో చూద్దామా..
కావలసిన పదార్థాలు: కర్బూజా -1, పంచదార - 2 కప్పులు, ఉప్పు - కొద్దిగా, యాలకులు - రెండు, ఐస్ క్యూబ్స్ - 5, కాజు - 4 లేక 5, పాలు - ఒక కప్పు.
తయారీవిధానం : ముందుగా కర్బుజా పై తోలు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఒక జ్యూసర్ లోకి తీసుకుని, అందులో పంచదార, రెండు యాలకులు, కొద్దిగా ఉప్పు, జీడిపప్పు, కాచి చల్లార్చిన పాలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లను కలుపుకోవచ్చు. కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ను అలానే తాగేయొచ్చు. లేక వడ కట్టుకుని అయినా తాగొచ్చు.