ఒక్కొక్కరి ముఖం ఒక్కోరకంగా ఉంటుంది. కొంతమందికి జిడ్డు చర్మమైతే, మరికొందరిది పొడిబారిన చర్మం. జిడ్డు చర్మం ఉన్నవారు రోజుకు ఎన్ని సార్లు ముఖం సబ్బుపెట్టి కడుక్కున్నా ఆముఖం నుండి జిడ్డు కారుతూనే ఉంటుంది. అలాంటివారు ఈ చిన్న చిట్కాను తరచూ పాటిస్తే ముఖంపై వచ్చే జిడ్డును తగ్గించుకోవచ్చు. రోజంతా పేస్ ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవచ్చు. బనానా తో తయారు చేసిన ఐస్ క్యూబ్స్ తో తరచూ ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే, తొందరలోనే జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పొచ్చు. ఇక, బనానా ఐస్ క్యూబ్స్ ను తయారుచెయ్యటం చాలా ఈజీ. ముందుగా, అరటిపళ్ళను గుజ్జుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మెత్తని మిశ్రమానికి కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా అలోవెరా జెల్ ను జోడించి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్స్ బాక్స్ లో పోసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. కొంతసేపటికి బనానా ఐస్ క్యూబ్స్ రెడీ అవుతాయి. ఎండలో నుండి బయటకు వెళ్లొచ్చిన తర్వాత ఈ బనానా ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని మర్దనా చేసుకుంటే, ఎండవల్ల కమిలిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. పెద్దగా ఉన్న చర్మరంధ్రాలను చిన్నవిగా చేస్తుంది. ముఖంపై ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న జిడ్డును తగ్గిస్తుంది.