వ్యాపారంలో పోటీ వినియోగదార్లకు మేలు చేకూర్చుతుంది. అందులోనూ పెట్రోల్ అమ్మకాలలో పోటీ అంటే ఎవరైనా స్వాగతిస్తారు. అలాంటి పోటీ వ్యాపారానికి వేదికైంది రాజంపేటకు వెళ్లే రవాణ మార్గం. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడపలోని రాజంపేటకు వెళ్లే మార్గంలోని రెండు బంకులు వాహనదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇతర పెట్రోల్ బంకులతో పోల్చితే తమ వద్ద లీటరుకు దాదాపు 2 రూపాయలు తక్కువ ధరకే పెట్రోలు పోయించుకోవచ్చని బోర్డులు పెట్టాయి.
అంతేగాక, ఆ రెండు పెట్రోలు బంకులు పోటీ పడి మరీ డిస్కౌంట్ ను కాస్త పెంచుకుంటూ పోవడం గమనార్హం. ఓ పెట్రోల్ బంకు లీటరుకు రూ.2 డిస్కౌంట్ ఇస్తామని బోర్డు పెట్టగా, మరో బంకు 2.40 రూపాయలు తగ్గిస్తామంటూ బోర్డు పెట్టింది.