ప్రతి ఫలంలో ఏదో ఒక ప్రయోజనం ఉన్నట్లో భగవంతుడు అందించిన ఆకుల్లో కూడా పలు దివ్య ఔషదాలున్నాయి. అలాంటి వాటిలో రోజ్ మేరి ఆకు కూడా ఒకటి. రోజ్‌మేరీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. . ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. మీ బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తాయి. ఈ లక్షణాలు మీరు త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. రోజ్‌మేరీ అనేక జీవక్రియ రుగ్మతల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోజ్మేరీలో ఉండే కార్నోసిక్ యాసిడ్‌కు ఊబకాయాన్ని తగ్గించే సామర్థ్యం ఉంది.