ఈ రోజుల్లో మధుమేహం, అధిక బరువు ప్రధాన సమస్యలుగా మారాయి. ఫలితంగా వచ్చే నష్టాలేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధులను చెక్ పెట్టాలంటే మీరు తినాలి వాము ఆకు అంటున్నారు వైద్య నిపుణులు. వాము ఆకులో పాలీఫెనాల్స్ ఫ్లేవనాయిడ్స్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. వాముకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే శక్తి కూడా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాము ఆకులు తింటే.. జీవక్రయ రేటు మెరుగుపడుతుంది, చక్కెరను నియంత్రిస్తుంది. తద్వారా బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. వాము ఆకుకు మలబద్ధకాన్ని తగ్గించే శక్తి కూడా ఉంది. ప్రతి రోజూ ఖాళీ కడుపుతో వాము ఆకు తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారు.